TG: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో BRS సర్పంచి అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘యూరియా కష్టాలు మళ్లీ వద్దు, ఆలోచించు ఓ రైతన్న’ అంటూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని కళ్లకు కట్టినట్లు యూరియా బస్తాను ఇంటింటికీ తీసుకెళ్తూ.. ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలను వివరిస్తూ BRS నాయకులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.