NLR: డిఎల్ఏన్ఆర్ ఉన్నత పాఠశాల 1984-85 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. 40 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మృతి చెందిన గురువులకు, తోటి స్నేహితులకు ఒక నిమిషం పాటు మౌనం వహించారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.