TG: రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులు వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. 1PM వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.