కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై కాల్వబుగ్గ గ్రామ బస్టాండు వద్ద రోడ్డు దాటుతున్న మేకల వెంకటేశ్వర్లు (36) అతివేగంగా వస్తున్న కారు ఢీకొని దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవాళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సునీల్‌కుమార్ తెలిపారు.