NZB: సిరికొండ మండలం తూంపల్లి గోప్యా నాయక్ తండా జీపీ సర్పంచ్, ఉప సర్పంచ్ సహా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన సర్పంచ్ మాలవత్ సుబ్బరవి, ఉప సర్పంచ్ బాదావత్ బంకెట్ లు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నగేష్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపాలన్నదే తమ ధ్యేయమని వారు తెలిపారు.