స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లను అతిగా చూడటం వల్ల కంటిచూపుపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ’20-20-20 ఫార్ములా’తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు విరామం తీసుకుని, 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్లపాటు చూడాలి. దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.