KMR: ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మహిళలకు అబార్షన్లు చేస్తే సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి విద్య హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం గైనకాలజిస్టులు, పీడియాట్రిస్ట్లు, రేడియాలజిస్టులతో జిల్లాస్థాయి ఎంటీపీ (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎమీమ్ పాల్గొన్నారు.