అన్నమయ్య: మహిళ కువైట్లో దారుణ హత్యకు గురైన విషయం శుక్రవారం బయటపడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వీరబల్లి మండలం మద్దెల మాలపల్లెకు చెందిన గున్నికుంట్ల శిరీష(25) జీవనోపాధి కోసం ఏడాది క్రితం కువైట్కు వెళ్లింది. అక్కడ బుధవారం రాత్రి ఆమెను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన తర్వాత గ్యాస్ పేలడంతో చనిపోయిందంటూ ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం జరుగుతుందని బంధువులు ఆరోపింస్తున్నారు.