AP: ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ పుష్కరాలు జూలై 7 వరకు జరగనున్నాయి. దీని ఏర్పాట్లపై త్వరలోనే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.