GDWL: కెటిదొడ్డి మండలం పరిధిలోని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచులు శాలువా, పుష్పగుచ్ఛం ఇచ్చి ఎమ్మెల్యేను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.