TG: గురువారం జరిగిన తొలి విడత ఎన్నికల విధులకు హాజరు కాని ఉద్యోగులపై అధికారులు సస్సెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పంపిన ఆయా జిల్లాల కలెక్టర్లు.. గైర్హాజరుపై ఎంపీడీవోల ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రెండో విడతకు సంబంధించిన ఎంపీడీవోలను రేపు కలిసి వివరణ పత్రం అందించాలని సూచించారు. సస్పెండ్ అయినవారిలో టీచర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు.