AP: రాష్ట్రానికి చెందిన పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక GI ట్యాగ్ లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ‘శ్రీకాకుళం వాసిగా ఇది నాకు ఎంతో గర్వించదగ్గ క్షణం. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, అవిశ్రాంత కృషి, ఎన్నో సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్ల తర్వాత పొందూరు ఖాదీకి GI ట్యాగ్ లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని X వేదికగా తెలిపారు.