VZM: గుర్లలో శుక్రవారం జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తక్షణ సాయం అందించి ఆసుపత్రికి తరలించారు. గరివిడి నుండి తిరిగివస్తుండగా ప్రమాదాన్ని గమనించిన ఎస్పీ వెంటనే వాహనాన్ని ఆపి గాయపడిన మహిళకు నీరు ఇచ్చి సపర్యలు చేశారు. అటుగా వచ్చిన ఆటోను ఆపించి స్వయంగా ఆమెను ఎక్కించి నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి పంపించారు.