కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా త్రాగునీరు పారిశుధ్య కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో కలెక్టర్ బాలాజీ ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ,ఎంపీ ల్యాడ్స్ తదితర సంబంధిత నిధులతో సచివాలయాలు, గ్రామపంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు , జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన వివిధ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.