VZM: రాజాంలో అభ్యుదయం సైకిల్ యాత్రను అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వద్ద చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సిఐ హెచ్.ఉపేంద్ర ప్రారంభించారు. ఈ ర్యాలిలో సుమారు 300 మంది విద్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు. మార్గ మధ్యలో కరపత్రాలు పంచుతూ, ప్లకార్డులు చూపిస్తూ, డ్రగ్స్ పై నినాదాలు చేస్తూ అవగాహన చేపట్టారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.