ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రంలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో జనవరి 30న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నాహజారే ఆరోపించారు. తాను చేపట్టే నిరాహార దీక్ష చివరి నిరసన అవుతుందేమోనన్నారు.