KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే సత్యప్రభ పెదశంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన వారు తమ వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రతి పిర్యాదును సంబంధిత అధికారులతో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.