MDK: పెద్ద శంకరం పేట మండలంలో ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శుక్రవారం పర్యటించి BRS బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులకు ఆయన శాలువాలు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల్ కో-ఆప్షన్ సభ్యులు యాదుల్, నాయకులు సురేష్, కోణం అంజయ్య తదితరులు ఉన్నారు.