SRCL: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆయా శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను ఇంఛార్జ్ కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.