AP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను క్రమంగా పరిష్కరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. స్త్రీ శక్తి పథకం సమర్థంగా అమలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అభినందించినట్లు తెలిపారు.