BDK: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య, అధికారులతో నేడు ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.