అన్నమయ్య: మదనపల్లి డివిజన్ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు శనివారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 13, 14వ తేదీల్లో క్రికెట్, త్రోబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను డీవో సుబ్రహ్మణ్యం, డీవో లోకేశ్వర్ రెడ్డి, మండల విద్యాధికారులు, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. విజేత జట్లు జిల్లా స్థాయిలో పాల్గొంటాయి.