BHPL: టేకుమట్ల మండలంలో 14న జరగనున్న రెండో విడత GP ఎన్నికల ప్రచారంలో మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “మాటలు ఘనం చేతలు శూన్యం” అంటూ తీవ్రంగా విమర్శించారు. పెన్షన్లు, రైతుల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. BRS అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ “రామ రాజ్యం” వస్తుందని పేర్కొన్నారు.