TG: ఈనెల 15న హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు డా.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కణ జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.అచ్యుత రామరాజు, కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. సీఎం రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నట్లు వారు వెల్లడించారు.