అన్నమయ్య: గాలివీడు మండలం గరుగుపల్లి గ్రామంలో ఆక్రమించబడ్డ పిలుగుంట్ర రాళ్ల గుట్ట ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు రెవెన్యూ, పోలీసు బృందాలు స్థలాన్ని పరిశీలించి, సర్వే నంబర్ 696లో 3.80 ఎకరాలు, 697లో 5.44 ఎకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ భాగ్యలత హద్దులు కేటాయించి గుర్తించారు.