భారత్ నుంచి విదేశాలకు వలస వెళ్లే సంపన్నుల సంఖ్య పెరగుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. 2024లో 5,100 మంది భారత మిలియనీర్లు ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. 2025లో ఇప్పటికే 4,300 మంది వీడినట్లు తెలుస్తోంది. 2022-24 మధ్య మూడేళ్లలో 18,300 మంది దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారు. వీరిలో ఎక్కువగా యూఏఈలో స్థిరపడినట్లు సమాచారం.