ATP: గుత్తి మున్సిపాలిటీలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గురువారం పట్టణంలోని ప్రధాన సర్కిల్లో గల రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలను చేపట్టామన్నారు.