KNR: గంగాధర మండలంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను గంగాధర ఎంపీడీవో డీ.రామ్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం 33 గ్రామాలు, 296 వార్డులకు పోలింగ్ జరుగుతోంది.