ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కనకదుర్గగుడిలో భవాని దీక్షల విరమణ కార్యక్రమం శుభారంభం అయింది. హోమ గుండాల వద్ద అగ్ని ప్రతిష్ఠ నిర్వహించి అర్చక స్వాములు దీక్షల విరమణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శీనా నాయక్, పాలకమండలి ఛైర్మన్ బొర్రా గాంధీ పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగమయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.