TG: భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు ZPHS పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తుండటంతో.. కాంగ్రెస్ అభ్యర్థులు అడ్డుకున్నారు. పోలీసులు చెప్పినా వినకుండా కార్యకర్తలు ప్రచారం చేయడంతో ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.