మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దేశ పోలింగ్ సందర్భంగా 139 గ్రామపంచాయతీలలో పోలింగ్ కొనసాగుతోంది. ఆయా గ్రామపంచాయతీలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే వారికి అక్కడే వైద్యం అందు విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.