SS: రామగిరి MPDO కార్యాలయంలో ఇవాళ ఉదయం MPP ఉప ఎన్నిక జరగనుందని ఎన్నికల అధికారి సంజీవయ్య తెలిపారు. గతంలో MPPగా ఉన్న మీనుగ నాగమ్మ మరణంతో ఈ ఎన్నిక తప్పనిసరిగా మారింది. నాలుగు సార్లు నోటిఫికేషన్ విడుదలైనా ఎన్నిక వాయిదాలు ఎదుర్కొంది. ఇదిలా ఉండగా, YCP MPTC సభ్యులు ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది.