SS: ఢిల్లీలో NHAI ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను హిందూపురం ఎంపీ పార్థసారథి కలిశారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న నేషనల్ హైవే రహదారుల విస్తరణ పనులు, పురోగతిపై వివరంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు అందేలా ప్రతి ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ అభ్యర్థించారు.