AKP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈనెల 13న నవోదయ పరీక్ష జరుగుతుందని హైస్కూల్ హెచ్ఎం, చీఫ్ సూపరింటెండెంట్ వైవి రమణ గురువారం తెలిపారు. 192 మంది పరీక్షకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.