KDP: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ బాలుడిని అరెస్టు చేసినట్టు బుధవారం పోలీసులు తెలిపారు. పులివెందుల పట్టణంలో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఆ బాలుడు వద్ద గంజాయిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1,300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.