TPT: తొట్టంబేడు మండలంలో కుమారుడిపై తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు.. శేషమనాయుడు కండ్రిగ గ్రామం దళితవాడలో చెంగల్ రాజు అనే వ్యక్తి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇదేమిటని ప్రశ్నించిన కుమారుడు రాజుపై కత్తితో దాడి చేశాడు. దీంతో రాజు చేతికి గాయం కావడంతో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాలి.