ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కనకదుర్గ గుడికి భవాని దీక్షలు ధరించిన భక్తులు గురువారం వేకువజాము నుంచే భారీ సంఖ్యలో చేరుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్గదర్శకాలు అమలు చేసింది. దుర్గగుడి ఈవో శీనా నాయక్ అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన సదుపాయాలను అందిస్తున్నారు.