MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో భాగంగా పాపన్నపేట్ పోలింగ్ స్టేషన్ను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఈరోజు పరిశీలించారు. కేంద్రంలోని ఏర్పాట్లు, భద్రతా వ్యవస్థ, క్యూలైన్ నిర్వహణను సమీక్షించి, ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సాయం అందించాలని ఆదేశించారు.