భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. ఓటర్లు ఇబ్బంది లేకుండా ఓటు వేసేలా ఏర్పాట్లు చూసి, అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. శాంతియుతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.