W.G: భీమవరం మండలం గూట్లపాడుకి చెందిన గౌరీ శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ PGRS సమావేశానికి వచ్చారు. కలెక్టర్ నాగరాణి దివ్యాంగుడు శంకర్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉండడంతో దివ్యాంగ ఫించన్ రూ. 6 వేల వస్తోందని, వందశాతం అంగవైకల్యం ఉన్న తనకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని కోరాడు. అర్జీని కలెక్టర్ అధికారులకు సిఫార్సు చేశారు.