KRNL: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతన చెల్లించాలని అంగన్వాడీ కార్మికులు డిమాండ్ చేశారు. AITUC, CITU ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అధికారుల వేధింపులు, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.