అన్నమయ్య: మదనపల్లిలోని బెంగళూరు బస్టాండ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషాను నూర్ష దూదేకుల సంఘాలు ఘనంగా సన్మానించాయి. మదనపల్లి జిల్లా సాధనకు ఎమ్మెల్యే చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా ఆయనను శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంత అధ్యక్షులు ఇందాదుళ్ల, చిత్తూరు జిల్లా అధ్యక్షులు షఫీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.