EG: గోకవరం – రంపఎర్రంపాలెం వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్తంభం కింది భాగం దెబ్బతింది. ప్రస్తుతం వైర్లు ఆధారంగా వేలాడుతున్న స్తంభం ఏ క్షణంలోనైనా రోడ్డుపై కూలే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు విద్యుత్ అధికారులను కోరుతున్నారు.