VSP: బంగ్లాదేశ్లో అక్టోబర్ 9న చిక్కుకున్న 9 మంది మత్స్యకారులను వెంటనే విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖ దక్షిణ వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ శుక్రవారం డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.45,000 సహాయం అందించాలని ఆయన కోరారు. గత సీఎం జగన్ మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.