యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రం ‘సింహాద్రి’. అయితే, రాజమౌళి మొదట ఈ కథను రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయాలని భావించారట. ఈ కథను ‘డార్లింగ్’కు చెప్పారట. కానీ, ప్రభాస్‌కు ఆ సమయంలో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ చిత్రాన్ని ఆయన వదులుకోవాల్సి వచ్చిందని, స్వయంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.