HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి అత్యాచార బాధితులకు పరిహార పంపిణీ పై సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అత్యాచార బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిడి నిర్మల పాల్గొన్నారు.