కోనసీమ: రాష్ట్రస్థాయి అండర్ -14 సాఫ్ట్ బాల్ పోటీలకు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి హైస్కూల్ విద్యార్థులు మల్లిపూడి అయ్యప్ప, సవరపు లక్ష్మి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం కనకదుర్గ, ఉపాధ్యాయులు శుక్రవారం వారిని అభినందించారు. వారు మాట్లాడుతూ.. మా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం పట్ల మా స్కూల్కు మంచి పేరు తీసుకువచ్చారని అన్నారు.