TG: ఐబొమ్మ రవిని ఎక్కువ రోజులు కస్టడీకి కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని రవి తరపు న్యాయవాది వాదించగా.. కస్టడీ తీసుకుంటేనే నెట్వర్క్ బయటపడుతుందని పోలీసుల తరపు అడ్వకేట్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈనెల 16కు తీర్పు రిజర్వు చేసింది.