VZM: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కంటు భుక్త వారి వీధిలోని వైన్ షాపు పక్కన ఉన్న పాన్ షాపు దగ్గర ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు మృతుని వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. మృతుని వద్ద ఐడెంటిటీకి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు.