ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధియే ముఖ్య ధ్యేయమని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శుక్రవారం కనిగిరిలోని 7వ వార్డులో రూ.10లక్షల నిధులుతో రోడ్డు నిర్మాణ పనులను 1వ వార్డు బీసీ కాలనీలో రూ. 23లక్షల 70వేల నిధులుతో డ్రైనేజీ కాలువలు నిర్మాణ పనులను ఛైర్మన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.